English   

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఉపేంద్ర దుమారం..

upen
2019-12-09 19:53:53

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్కౌంటర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాళ్లను పోలీసులు అరెస్టు చేసినప్పుడు చంపేయాలి అన్నారు. ఇప్పుడు చంపేసిన తర్వాత అలా ఎలా చంపేస్తారు అని అడుగుతున్నారు. ఒక అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా సజీవదహనం చేసిన నరరూప రాక్షసులను చంపడంలో ఎలాంటి తప్పు లేదు.. కానీ ఇలా చంపడం మాత్రం తప్పు అంటున్నారు కొందరు సెలబ్రిటీలు. ఇప్పటికే తెలుగులో మంచు లక్ష్మీ, రేణుదేశాయ్ ఇలాంటి వాళ్లు ఈ ఎన్ కౌంటర్ పై తమ మనసులో మాట బయట పెట్టారు. కూటికి గతి లేని నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన అబ్బాయిలు కాబట్టి.. అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి.. వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చనిపోయిన దిశ కు న్యాయం చేశారు. ఒకవేళ ఆ స్థానంలో పెద్ద వాళ్ళ అబ్బాయిలు ఉంటే నిజంగానే ఎన్కౌంటర్ చేసే వాళ్ల అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పుడు ఇదే విషయంపై ప్రముఖ నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు ఉపేంద్ర చేసిన ట్వీట్‌ దుమారం రేపుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర ట్విటర్‌లో చేసిన పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.

నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర స్పందిస్తూ.. ఆ నలుగురే దిశపై అత్యాచారం చేసి కాల్చి చంపారా అని ప్రశ్నించారు. ప్రముఖుల విషయంలో ఈ రకమైన ఎన్‌కౌంటర్‌లు ఎందుకు జరగడం లేదని నిలదీశారు. కోర్టు విచారణ పూర్తి కాకపోముందే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం సరికాదన్నారు. ఒకప్పుడు ఎన్‌కౌంటర్‌ల ద్వారా రౌడీయిజం తగ్గిపోయిందని అని అన్నారు. నిజాయితీ కలిగిన అధికారులు దృష్టిపెడితే ఎన్‌కౌంటర్‌ల ద్వారా మహిళలపై అత్యాచారాలను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ ధనవంతులు, ప్రముఖులు దీనిని దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉపేంద్ర చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారుతోంది. దీన్ని కొందరు సపోర్టు చేస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా కూడా కోర్టు ఉరి శిక్ష వేస్తే పర్లేదు కానీ కోర్టు అనుమతి లేకుండా పోలీసులు అలా తీసుకెళ్లి చంపేస్తే ఏంటి దాని అర్థం అంటూ నిలదీస్తున్నారు ఉపేంద్ర.

 

More Related Stories