English   

అక్కడ రప్ఫాడిస్తున్న రామ్ ఫ్లాప్ సినిమా..

ram
2019-12-10 05:08:22

తెలుగు సినిమాలకు ఇప్పుడు తెలుగులోనే కాకుండా చాలా ఇండస్ట్రీలలో కూడా ఫుల్ డిమాండ్ ఉంది. మన దగ్గరే కాదు హిందీలో కూడా మన సినిమాలను తెగ చూస్తున్నారు ఆడియన్స్. అందుకే శాటిలైట్ రైట్స్ తో పాటు హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీ రేట్ కు అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా యూ ట్యూబ్ లో అయితే మన హీరోలు రికార్డులు తిరగరాస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు అక్కడ ఉండే డిమాండ్ మాటల్లో చెప్పలేం. ఇక రామ్ కూడా అక్కడ రప్ఫాడిస్తున్నాడు. ఈయన నటించిన ఓ సినిమా ఇప్పుడు యూట్యూబ్ లో దుమ్ము దులిపేస్తుంది. గతేడాది దసరా సమయంలో విడుదలైన హలో గురూ ప్రేమకోసమే తెలుగులో పెద్దగా విజయం సాధించలేదు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం పర్లేదనిపించింది అంతే. కానీ ఇప్పుడు హిందీలో దీన్ని ధూందార్ కిలాడీగా విడుదల చేశారు. యూట్యూబ్ లో ఈ సినిమా 140 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని ఇంకా దూసుకుపోతోంది. అంటే దాదాపు 14 కోట్లకు పైగా ఈ సినిమాను చూసారన్నమాట. పైగా 1 మిలియన్ వ్యూస్ లైక్ లను కూడా దక్కించుకుంది హలో గురూ ప్రేమకోసమే సినిమా. తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాను హిందీ డబ్బింగ్ లో హిట్ కొట్టాడు రామ్. నేను శైలజ సినిమా కూడా 130 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్ లో పాపులర్ అయ్యాడు రామ్. ఇదే క్రేజ్ ఇప్పుడు ఈ చిత్రానికి పనికొచ్చింది.

More Related Stories