స్టైల్ ఐకాన్ ఆఫ్ టాలీవుడ్.. విజయ్ దేవరకొండ..

అదేంటి అంత పెద్ద మాట అనేసారు.. ఆల్రెడీ బన్నీ ఉన్నాడు కదా అనుకుంటున్నారా..? స్టైలిష్ స్టార్ అని బిరుదు కూడా ఉంది ఇప్పుడు విజయ్ ను పట్టుకుని స్టైల్ ఐకాన్ అంటున్నారేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు నిజంగానే విజయ్ స్టైలిష్ స్టార్ అవుతున్నాడు. తాను ఎంచుకుంటున్న కథలు చేస్తున్న సినిమాలు మాత్రమే కాదు మేకోవర్ విషయంలో కూడా విజయ్ దేవరకొండ చాలా కొత్త పద్ధతుల్లో వెళ్తున్నాడు. బాలీవుడ్లో హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే మేకోవర్స్.. ఇక్కడ రెగ్యులర్ గా చేస్తున్నాడు విజయ్. తాజాగా ఈయన ఫోటో షూట్ చేశాడు. అందులో పూర్తిగా కొత్త రూపంలోకి మారిపోయాడు విజయ్. ఈయనను చూస్తుంటే పిచ్చెక్కిపోతుందంతే. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు గుర్తొస్తుంది కానీ ఆ ప్లేస్ లోకి రావాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ.
పింక్ డ్రస్ లో పిచ్చెక్కించాడు విజయ్. ఇది న్యూ స్టైల్ అంటూ ఆయన స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నాడు. పైగా లుక్ కూడా మార్చేసాడు. ప్రస్తుతం హీరోగానే కాకుండా ఈ మధ్యే నిర్మాతగా కూడా ప్రయాణం మొదలు పెట్టాడు ఈయన. కింగ్ ఆఫ్ హిల్స్ అనే నిర్మాణ సంస్థను మొదలుపెట్టాడు విజయ్. ఇక హీరోగా క్రాంతిమాధవ్ వరల్డ్ ఫేమస్ లవర్ తో పాటు పూరీ జగన్నాథ్ ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు బిజినెస్ మాన్ గాను సత్తా చూపిస్తున్నాడు.. అన్ని రంగాల్లోనూ దూసుకుపోతూ తెలుగు ఇండస్ట్రీకి కొత్త పద్ధతులు నేర్పిస్తున్నారు ఈ అర్జున్ రెడ్డి.