English   

మరో సినిమా మీద వివాదం...ప్రదర్శనలు నిలిపివేత

pani
2019-12-11 04:59:10

ఈ మధ్య కాలంలో సినిమాల వివాదాలు సృస్టించడం కామన్ అయిపోయింది. తాజాగా తెలుగులో  సైరా నరసింహా రెడ్డికి ఇదే ఇబ్బంది ఎదురు కాగా తాజాగా బాలీవుడ్ లో చారిత్రక నేపథ్యంతో నిర్మించిన ‘పానిపట్’ చిత్రం వివాదాస్పదంగా మారింది. ఈ సినిమాపై హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలోని చాలా థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శన నిలిపివేశారు. ఈ సినిమాలో జాట్ వర్గీయులను తప్పుగా చిత్రీకరించారని ఆ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రదర్శన నిలిపివేశామని చెబుతున్నారు.

ఈ సినిమాని మూడో పానిపట్ యుద్ధం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అర్జున్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో అర్జున్ సరసన కృతి సనన్ నటించగా, అఫ్గానిస్తాన్ సైన్యాధిపతి అహ్మద్ షా అబ్దాలి పాత్రలో సంజయ్ దత్ నటించారు. ఈ సినిమాకి అశుతోష్ గొవారికర్  దర్శకనిర్మాతగా వ్యవహరించారు.  జాట్ మహారాజు సూరజ్ మల్ పాత్రను తప్పుగా చిత్రీకరించారని రాజస్థాన్ లోని జాట్లు ఆందోళనకి దిగి దర్శకుడి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అంతేకాక సూరజ్ మాల్ కుటుంబంలో 14వ తరానికి చెందిన రాజస్థాన్ పర్యాటక శాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్ కూడా ఈ సినిమాపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పానిపట్ సినిమాలో మహరాజా సూరజ్ మాల్ పాత్రను తప్పుగా చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు.  

 

More Related Stories