English   

క్రేజీ కాంబో ప్రభాస్ శంకర్ 

 Prabhas
2019-12-11 12:51:13

బాహుబలి, బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా సినిమా రిలీజ్ కావడంతో ప్రభాస్ ఇమేజ్ హాలివుడ్ స్థాయికి చేరింది. అయితే ఆ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి సాహో సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ నిర్మాణ విలువలతో రూపొందించినప్పటికీ బాక్సాఫీసు వద్ద మాత్రం నిలవకేకపోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్టార్ డైరెక్టర్, భారీ సినిమాల స్పెషలిస్ట్ శంకర్‌ ప్రభాస్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాతో శంకర్ బిజీగా ఉన్నాడు. తన ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చే శంకర్ , ప్రభాస్ తో కూడా ఒక మెసేజ్ తో కూడిన ఒక స్క్రిప్ట్ రూపొందిస్తున్నారని , “బాహుబలి ” మూవీ ని మించి భారీబడ్జెట్ తో ఈ మూవీ రూపొందనుందని సమాచారం. ఈ భారీ బడ్జెట్ మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందే అవకాశం ఉందనేది ట్రేడ్ వర్గాల సమాచారం. నిజానికి శంకర్ తో దిల్ రాజు భారతీయడు 2 సినిమానే చేయాల్సింది. కానీ అనుకోని కారణాల వలన ఆయన ఈ సినిమా వదులుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం జిల్ రాధాకృష్ణ డైరెక్షన్లో ‘జాన్’అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయ్యాకే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  ఇంటర్నేషనల్‌గా  హెవీ మార్కెట్ ఉన్న ప్రభాస్‌, శంకర్ ల కాంబినేషన్ లో సినిమా అనే టాక్ రావడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.  

More Related Stories