English   

పెళ్ళికి కాజల్ సిద్దమయినట్టేనా 

Kajal Aggarwal
2019-12-11 13:16:45

 స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లిపీటలెక్కేందుకు సిద్దమైందా ? తన మనస్సు గెలిచిన వ్యక్తి తో మూడు ముళ్లు వేయించు కునేందుకు రెడీ అంటోందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇండస్ట్రీకి ఏంట్రీ ఇచ్చి 15 ఏళ్లు దాటిన కాజల్ అగర్వాల్ కెరీర్ స్పీడ్ గ్రాఫ్ ఇంకా పడిపోలేదు. హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా చిన్నా చితకా సినిమాలకు కూడా సంతకాలు చేస్తోంది. అటు బడా స్టార్స్ చిత్రాలతో పాటు ఇటు మిడియం రేంజ్ హీరోల పక్కన నటిస్తూ కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తోంది. 34 ఏళ్లు దాటిన కాజల్ పెళ్లి ఆలోచనే లేకుండా కెరీర్ ని కంటిన్యూ చేస్తోంది. తాజాగా ఆమె ఒక ఫొటోను తన ఇన్‌స్ట్ర్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. అది ఇప్పుడు ఆమె పెళ్ళికి సంబంధించి పలు రకాల ఊహలకు తావిస్తోంది. ఆ పిక్ లో కాజల్‌ సముద్ర తీరంలో సంధ్యాసమయంలో రెండు చేతులు పైకి ఎత్తి నిలబడినట్లు ఉంది. అయితే ఆమె రెండు చేతుల వేళ్లను లవ్ సింబల్ ఆకారాన్ని చూపించేలా పెట్టింది. దీంతో తాను ప్రేమలో పడ్డట్టు సింబాలిక్‌గా కాజల్‌ చెప్పిందంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆమె అభిమానులు పెళ్లి కళ వచ్చేసిందా కాజల్‌? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చూద్దాం ఇప్పటికన్నా కాజల్ పెళ్ళికి సిద్దం అంటుందో లేదో ? 

More Related Stories