English   

అల వైకుంఠపురములో టీజర్.. నేనిప్పుడే కారెక్టర్ ఎక్కా.. 

Ala Vaikunthapurramuloo
2019-12-11 17:02:54

నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయిపోయింది. తాజాగా విడుదలైన టీజర్ నెంబర్ వన్ ట్రెండింగ్ అవుతుంది. ఈ టీజర్ చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. ఓ గ్రౌండ్ లో విలన్స్ ను బాదుతూ ఉన్నపుడు చెప్పిన డైలాగ్ అయితే అదుర్స్. మాస్ కు కూడా ఈ చిత్రంలో కావాల్సినంత మసాలా ఉందని ఈ టీజర్ తో చూపించేసాడు దర్శకుడు త్రివిక్రమ్. ఇక ఈ మధ్యే విడుదలైన సామజవరగమన, రాములో రాములా పాటలు కూడా అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేసాయి.

ఇఫ్పుడు టీజర్ కూడా ఇదే చేస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తమన్ ఈ స్థాయి మ్యూజిక్ అయితే ఈ సినిమాకు ఇవ్వలేదు. వినీ వినగానే సూపర్ బ్లాక్ బస్టర్ అయిపోయింది ఈ ట్యూన్. ఇక టీజర్ లో కూడా అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. విడుదలైన క్షణం నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ టీజర్. దాన్నిబట్టి బన్నీ రేంజ్ ఏంటనేది అర్థమవుతుంది. మీ నాన్న నిన్ను పెళ్లికూతురును దాచేసినట్లు దాచేసాడు.. సరిగ్గా చూడలేదు కూడా అంటూ మొదలైన టీజర్.. మీరిప్పుడే కార్ దిగారు.. నేను కారెక్టర్ ఎక్కా అంటూ పంచ్ డైలాగుతో ముగిసింది. మధ్యలో చాలా చేసాడు బన్నీ. త్రివిక్రమ్ కూడా మంచి కసితో ఈ చిత్రం చేసాడని అర్థమవుతుంది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డీజే సినిమా తర్వాత పూజా హెగ్డే మరోసారి ఇందులో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేస్తోంది.

More Related Stories