English   

దొంగతనాలతో జల్సా.. సీరియల్ నటుడు అరెస్ట్..

theft
2019-12-11 19:24:50

పేరుకు చెప్పుకోవడానికి ఆయన సీరియల్ నటుడు.. కానీ చేసేవన్నీ దొంగ పనులు. జల్సా లైఫ్ కోసం దొంగగా మారి ఇప్పుడు పోలీసుల ముందు దోషిగా నిలబడ్డాడు ఒక సీరియల్ నటుడు. వచ్చే డబ్బులు సరిపోక లగ్జరీ జీవితం కోసం ఇళ్లలో చోరీలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇప్పటికే చాలా దొంగతనాలు చేసిన ఆ నటుడు కూకట్‌పల్లి భాగ్యనగర్‌కాలనీలో ఓ ఇంట్లో చోరీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని దగ్గర్నుంచి 12 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఆ నటుడి పేరు బలిజ విక్కీ. వికాస్‌నగర్‌ లో ఉండె విక్కీ తెలుగులో వచ్చే టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తుంటాడు. అయితే గతేడాది ఓ సీరియల్ లో నటించడానికి డబ్బులు అవసరం కావడంతో దొంగగా మారాడు. ఆ తర్వాత కూడా అదే అలవాటుగా చేసుకొని చోరీలు చేస్తూ జల్సా చేస్తున్నాడు విక్కీ. ఆయనపై కేసు నమోదు కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. గతంలోనూ విక్కీపై పలు కేసులు నమోదు అయ్యాయి. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. మరోసారి దొంగతనం చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ సారి మనోడిపై కాస్త సీరియస్ గానే ఉన్నారు పోలీసులు.

More Related Stories