పొన్నియన్ సెల్వన్ షూట్ మొదలు

దిగ్గజ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. ఈ స్క్రిప్ట్ స్క్రిప్ట్ పై మణిరత్నం చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ లేనివిధంగా ఈ చిత్రాన్ని మణిరత్నం ప్రెజెంట్ చేయనున్నారు. పొన్నియన్ సెల్వన్ అనే ప్రసిద్ధ తమిళ నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమా అనుకున్నారు. ఛియాన్ విక్రమ్, కార్తీ, జయంరవి, పార్తిబన్, జయరాం, ఐశ్వర్యరాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించనున్న ఈ చిత్రం తొలిషెడ్యూల్లో థాయ్లాండ్ దేశంలో నేటి నుండి మొదలు కానుంది. దాదాపు 40 రోజులపాటు అక్కడే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. వారం రోజులు ముందుగానే సినిమా యూనిట్ మొత్తం థాయ్లాండ్ చేరుకుంది. ఇక తాజా సమాచారం మేరకు ఈ సినిమా నుండి కీర్తి సురేశ్ తప్పుకున్నట్లు సమాచారం. ఈమె ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదని, డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడమేనని కోలీవుడ్ వర్గాల సమాచారం. కీర్తిసురేశ్ స్థానంలో త్రిష నటించనుందని వార్తలు వినపడుతున్నాయి. భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ శుభాస్కరన్ నిర్మిస్తున్నారు.