వరల్డ్ ఫేమస్ లవర్ నుండి ఐశ్వర్యా రాజేష్ ఫస్ట్ లుక్

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా తెరకెక్కించిన క్రాంతిమాధవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈసినిమా దాదాపు షూటింగ్ అంతా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను ఫిబ్రవరి 14 న ఈ సినిమా రిలీజ్ అనుకుంటున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఆమధ్య విజయ్ సిగరెట్ తాగుతు న్నట్టు ఉన్న పిక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రచారంలో భాగంగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తన నలుగురు లవర్స్‌ని పరిచయం చేయబోతున్నట్లు నిన్న చిత్రబృందం ప్రకటించింది. వారు ప్రకటించిన దాని ప్రకారం నాలుగు రోజుల్లో వరుసగా నాలుగు పోస్టర్లు వదలనున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 12న అంటే ఈరోజు ఐశ్వర్యా రాజేష్, 13న అంటే రేపు ఇజా బెల్లా, ఎల్లుండి 14న క్యాథరిన్ త్రెసా, ఆ తర్వాత 15న రాశీఖన్నాలకు సంబంధించిన లుక్‌లు విడుదల చేయనున్నారు. ఈ నాలుగు లుక్స్ సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేస్తామన్నారు. అందులో భాగంగా ఈరోజు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఐశ్వర్యా రాజేష్‌తో విజయ్ దేవరకొండ వాటేసుకున్న ట్టు ఉన్న రొమాంటిక్ లుక్ బాగుంది. శీనయ్యతో సువర్ణ , ప్రేమికుల రోజున కలవండి అంటూ ఈ పోస్టర్ కి క్యాప్షన్ పెట్టీ విడుదల చేశారు. ఈ సినిమాను కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.