లండన్లో పోలీసులకి చిక్కిన శ్రేయ...చివరికి

నటి శ్రియ లండన్ పోలీసులకి చిక్కింది. అమ్మో ఏమైందో అని టెన్షన్ పడకండి. ప్రస్తుతం శ్రియ తమిళంలో సండైక్కారి అనే సినిమాలో నటిస్తోంది. వివాహానంతరం ఈమే నటిస్తున్న దక్షిణాది చిత్రం ఇదొక్కటే. విమల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని బాస్ ప్రొడక్షన్స్ కార్పొరేషన్ అండ్ మెట్రో నెట్ మలీ్టమీడియా సంస్థల సమర్పణలో జే.జయకుమార్ నిర్మిస్తున్నారు. మాదేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రియ ఫారెన్ లో సెట్లయిన సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాహకురాలుగా నటిస్తోంది. విమల్ ఆమె కంపెనీలో పనిచేసే ఇంజినీర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల లండన్లో నిర్వహించారు. అప్పుడు శ్రియ తెలియకుండా విమానాశ్రయంలోని భద్రతా ప్రాంత సరిహద్దులను దాటి వెళ్లిందట. దీంతో లండన్ భద్రతాధికారులు ఆమెను చుట్టి ముట్టి ఆమెను అదుపులోకి తీసుకున్నారట. అక్కడితో ఆగక ఈ ప్రాంతంలోకి ఎలా వస్తావు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారట. దీంతో బిత్తరపోయిన శ్రియ ను చూసి ఆ ప్రాంతానికి కాస్త దూరంగా ఉన్న నటుడు విమల్ వెంటనే అక్కడికి వెళ్లి తగిన ఆధారాలు చూపి పరిస్థితిని వివరించారట. దీంతో పోలీసులు శ్రియను వదిలిపెట్టినట్లు చెప్పుకొచ్చాడు ఆ దర్శకుడు.