బాబు ముద్దొస్తున్నాడంటున్న హాట్ బ్యూటీ రష్మిక మందన్న..

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం రష్మిక మందన్నకు మంచి ఇమేజ్ ఉంది. ఈమె స్టార్ హీరోయిన్ అవ్వడానికి అడుగు దూరంలోనే ఉంది. ఇప్పటికే వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రొమాన్స్ చేస్తుంది. ఈయనతో సరిలేరు నీకెవ్వరు అంటూ వస్తుంది ఈ బ్యూటీ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు మరో పాట టీజర్ కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. హీ ఈజ్ సో క్యూట్ అంటూ సాగే ఈ పాట డిసెంబర్ 16 సాయంత్రం 05.04 గంటలకు విడుదల చేయనుంది చిత్ర యూనిట్.
ఇందులో భాగంగానే చిన్న ట్యూన్ ఇప్పుడు విడుదల చేసారు. హీ ఈజ్ సో క్యూట్ అంటూ విడుదల చేసిన ఈ పాటలో హీరోయిన్ రష్మిక మందన్న అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ పాటకు డాన్స్ చేస్తున్న వీడియో గ్లింప్స్ ఇప్పుడు టిక్ టాక్‌లో వైరల్ అవుతుంది. ఈ పాటకు రష్మిక మందన్న వేసిన స్టెప్పులు దుమ్ము లేపుతున్నాయి. ఆమె డ్యాన్స్‌కు మహేష్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రష్మిక, మహేష్ ఒకరినొకరు ఆటపట్టిస్తూ సాగే ఈ రొమాంటిక్ గీతానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేసినట్లుగా అర్థమవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా సరిలేరు నీకెవ్వరు విడుదల కానుంది.