English   

ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ ట్రైలర్ టాక్

trailer
2019-12-14 07:11:33

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ ఒక పొలిటికల్ సెటైర్ సినిమాతో ముందుకొచ్చిన వర్మ ఆ సినిమా రిజల్ట్ కూడా పట్టించుకున్నట్టు లేదు. ఇక ఆయన తన తదుపరి సినిమాగా భార‌త్‌లో తొలి మార్ష‌ల్ ఆర్ట్స్ చిత్రంగా ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్ అనే సినిమాని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కాగా దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా డో చైనీస్ కొలాబరేషన్ లో నిర్మిత‌మ‌వుతొండగా పూజా బాలేకర్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా అంతర్జాతీయ ట్రైలర్‌ను బ్రూస్‌ లీ సొంత పట్టణమైన చైనాలోని ఫోషన్‌ సిటీలో ఈ రోజు విడుద‌ల చేశారు. రామ్ గోపాల్ వ‌ర్మ స్వ‌యంగా చైనా వెళ్లి ట్రైల‌ర్ లాంచింగ్ చేశారు. ఒకప్పుడు బ్రూస్ లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ సినిమాను చూసేందుకు సైకిల్ పై థియేటర్ కు వెళ్లే వాడినని, కాని ఇప్పుడు నేను బ్రూస్ లీ గురించి తీసిన సినిమా ట్రైలర్ ను ఆయన పాదాల వద్ద ఆవిష్కరించేందుకు విమానం ఎక్కి ఇక్క‌డికి వచ్చానంటూ ఉద్వేగ‌భ‌రిత కామెంట్స్ చేశారు వర్మ.  బ్రూస్ లీని ఆరాధిస్తూ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందే ఓ యువతి కథని వర్మ తనదైన శైలిలో గ్లామర్, రొమాన్స్ జోడించి తెరకెక్కిస్తున్నాడని ట్రైలర్ తో క్లారిటీ వచ్చినట్టయ్యింది. పూజాని వర్మ యాక్షన్ ఎపిసోడ్స్ లో పవర్ ఫుల్ గా చూపిస్తూనే గ్లామర్ షో కూడా చేయిస్తున్నాడు. ఇంకెందుకు ఆలశ్యం ఈ ట్రైలర్ మీరు కూడా చూడండి.

 

More Related Stories