English   

యాంకర్ సుమ కావాలంటే అది భరించక తప్పదమ్మా..

suma
2019-12-14 07:41:30

సుమ కనకాల.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఆరు నుంచి అరవై వరకు తనవైపు తిప్పుకునే సత్తా ఉన్న యాంకర్. ఈటీవీ మాటీవీ అని తేడా లేకుండా ఏ టీవీలో చూసినా సుమ ఒక్కతే కనిపిస్తుంటుంది. ఈ గ్లామర్ ప్రపంచంలో రోజుకో కొత్త యాంకర్ వచ్చినా కూడా సుమను మాత్రం బీట్ చేయలేకపోతున్నారు. ఈమె పద్దతిగా కనిపిస్తూనే అందర్నీ కట్టిపడేస్తుంది. ఓవైపు అనసూయ, రష్మి లాంటి వాళ్లు గ్లామర్ షోలతో పడగొడుతున్నా కూడా సుమ ముందు వాళ్లు మాత్రం దిగదుడుపే. ఎందుకంటే తెలుగు టెలివిజన్ లో సుమకు సుమే సాటి.. ఆమెకు లేరు ఎవరు పోటీ. అది ఎవర్ని అడిగినా చెబుతారు. పైగా స్టార్ హీరోలు.. దర్శక నిర్మాతలు కూడా సుమ హోస్టింగ్ అంటే పడి చచ్చిపోతారు. అందుకే ఈమె డిమాండ్ కూడా అలాగే ఉంది.

ఇదే ఇప్పుడు నిర్మాతల జేబులకు చిల్లు పడేలా చేస్తుందని ప్రచారం జరుగుతుంది. అర్థం కాలేదు కదా.. సుమ ప్రస్తుతం ఒక్కో సినిమా రిలీజ్ ఫంక్షన్‌కు దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు తీసుకుంటుందని తెలుస్తుంది. సినిమా రేంజ్ బట్టి రేట్ ఉంటుంది. అయితే దాంతో పాటే జీఎస్టీ కూడా నిర్మాతల దగ్గరే వసూలు చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో యాంకర్ సుమకు మరీ ఇంత డిమాండ్ ఉందా అంటూ నిర్మాతలు కూడా పరేషాన్ అవుతున్నారు. ఓ వైపు యాంకర్ సుమ పారితోషికమే తడిసి మోపెడవుతుంటే.. పై నుంచి జీఎస్టీ కూడా నిర్మాతలే కట్టాల్సి రావడంతో తల పట్టుకుంటున్నారు. ఇంత చేసినా కూడా సుమ డిమాండ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు సరికదా పెరుగుతుంది. పెద్ద సినిమా ఈవెంట్స్ కు సుమ తప్ప మరో ఆప్షన్ లేకుండా పోతుంది. పైగా స్టార్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ కూడా ఈమె కావడంతో నిర్మాతలు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు.

More Related Stories