English   

రానా బర్త్‌డే స్పెషల్‌...విరాటపర్వం సినిమా ఫస్ట్ లుక్‌

 Virata Parvam
2019-12-14 19:46:54

లీడర్ మూవీతో హీరోగా తెలుగు తెరకు హీరోగా పరిచయం అయిన దగ్గుబాటి వారసుడు రానాకి ఆ సినిమా బాగా ఆడినా ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా వర్క్ ఔట్ కాలేదు.  దాంతో బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ సెకండ్ హీరోగా నటించాడు.  అక్కడా పెద్దగా వర్కౌట్ కాలా, ఈ క్రమంలో రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘బాహుబలి, బాహుబలి2’.  ఈ మూవీలో రానా విలన్ గా తన విశ్వరూపాన్ని చూపించాడు.  ప్రభాస్ బాహుబలిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో రానా, భళ్లాలదేవుడిగా అంతే పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని అనారోగ్య కారణాల వలన సినిమాలకి దూరంగా ఉన్న రానా ఇప్పుడు వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పటికే హాతీ మేరే సాథీ సినిమా షూటింగ్ పూర్తి చేసిన రానా, తాజాగా ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా తన నెక్ట్స్‌ సినిమా ఫస్ట్‌ లుక్‌ రివీల్ చేశాడు. విరాట పర్వం సినిమాలోని రానా లుక్‌ని రివీల్ చేశారు. నీది నాది ఒకే కథ ఫేం వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాలో సాయి పల్లవి రానాకి జోడిగా నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో సాయి పల్లవి నక్సలైట్‌ పాత్రలో నటిస్తుందన్న ప్రచారం కూడా ముందు నుండి జరుగుతోంది. జూన్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ దాదాపు సగం పూర్తయ్యింది. మధ్యలో రానా షూటింగ్‌లకు బ్రేక్‌ ఇవ్వటంతో సినిమా ఆలస్యమైంది. ఇటీవల రానా తిరిగి షూటింగ్‌లో పాల్గొంటుండటంతో వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

More Related Stories