ఆ దర్శకుడి భార్యను కాకా పడుతున్న కాజల్

నటి కాజల్ ఏమిటి దర్శకుడి భార్యను కాకా పట్టడం ఏమిటి అనుకుంటునారా ? అవునండీ.. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా కాజలే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం కాజల్ వరస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె తన సినిమాలతో పాటు బయట ఈవెంట్స్‌తో కూడా బాగానే బిజీగా ఉంది ఈ మధ్య. ఎక్కడికి వెళ్తుంటే ఫ్లైట్‌లో అనుకోని అతిథి పక్కనే కూర్చుంది. ఆమె మరెవరో కాదు రాజమౌళి భార్య రమా రాజమౌళి.
ఈమెను చూసిన కాజల్ ఒక్కసారిగా ఎగిరి గంతేసినంత పని చేసి వెంటనే పక్కకి వెళ్లి కూర్చుని ఆమెను గట్టిగా కౌగిలించుకోవడమే కాకుండా ముద్దు కూడా పెట్టేసింది. తనను రియల్ లైఫ్‌లో బాగా ఇన్స్పైర్ చేసిన కారెక్టర్స్‌లో రమా మేడమ్ కూడా ఒకరు అంటూ ఆమెను హత్తుకుంది కాజల్. అలాంటి గ్రేట్ పర్సన్ తను వచ్చే విమానంలోనే పక్కనే ఉండటాన్ని చూసి ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది కాజల్. అందుకే వెంటనే ఆ సంతోషాన్ని ముద్దుల రూపంలో చూపించేసింది. నిజానికి మిగతా హీరోయిన్స్ లాగా కాజల్ ఎవరితోనూ అంత ర్యాపోను మెయిన్టైన్ చేయదు. అలాంటిది రమా రాజమౌళితో ప్రత్యేకంగా ఫొటో తీసి పెట్టడంతో.. దర్శకుడి భార్యను కాజల్ కాకా పడుతోంది అన్న టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది.