English   

గీతాకి హ్యాండిచ్చాడా...గీత చేయూతనిచ్చిందా 

Naga Chaitanya
2019-12-15 14:39:33

గీత గోవిందం సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్‌ అందరికీ గుర్తుండే ఉంటాడు. కోట్లు సంపాదించి పెట్టిన యా సినిమా తరువాత పరశురామ్‌ మరో సినిమా మొదలుపెట్టడానికి చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. గీత గోవిందం సినిమా తరువాత స్టార్ హీరోతో సినిమా చేయాలని భావించాడు పరశురామ్‌. మహేష్ బాబుతో సినిమా కోసం చాలా ప్రయత్నాలే చేసి, ఒకానొక దశలో మహేష్‌తో ప్రాజెక్ట్ ఓకె అయినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ ఫైనల్‌ కాలేదు. తరువాత మరికొంత మంది స్టార్ హీరోలను ప్రయత్నించి పరశురామ్‌ ఫైనల్‌గా యువ సామ్రాట్‌ నాగచైతన్య 20వ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించడానికి రెడీ అయ్యాడు. నిన్న  ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాను 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. నిజానికి లెక్క ప్రకారం దర్శకుడు పరుశరామ్ కూడా గీతా ఆర్ట్స్ లోనే నెక్ట్స్ సినిమా చెయ్యాలి కానీ, అల్లు అరవింద్ ఇచ్చిన మినహాయింపుతో బయిట బ్యానర్ కు వెళ్లి సినిమా చేస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి ఆయన ఆ బ్యానర్ లో గీతా గోవిందం, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు చేసారు. అయితే మూడో సినిమా ఎంతకీ తెగడం లేదు కాబట్టి ఆయన వేరే బ్యానర్ లోకి వెళ్లి ఆ సినిమా చేస్తున్నాడు. 

More Related Stories