English   

సురేష్ బాబు మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడుగా 

Suresh Babu
2019-12-15 14:54:27

ఈ మధ్యకాలంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ సొంతంగా అంటే ఒక్కరే కాకుండా మరో బ్యానర్ ను కలుపుకుని సినిమాలు నిర్మిస్తోంది. అది కాక మంచి కంటెంట్‌తో వెరీ ఎవరైనా సినిమా తెరకెక్కిస్తే ఈ సినిమా రైట్స్ కొనుక్కొని మరి రిలీజ్ చేస్తున్నాడు సురేష్ బాబు. తాజాగా తన తమ్ముడు వెంకటేష్, మేనల్లుడు నాగచైతన్య హీరోలుగా ‘వెంకీ మామ’ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కి కొన్ని రోజుల ముందు మీడియాతో మాట్లాడుతూ ఓటిటి ప్లాట్‌ఫాంలు థియేట్రికల్ వ్యాపారాన్ని చంపుతున్నాయని, చాలా థియేటర్లు వీటి వలన మూసేసే పరిస్థితి ఉందని  చెప్పడం వలన వెంకీ మామను అమెజాన్ ప్రైమ్ వంటి వాటికి అమ్మకపోవచ్చని అందరూ ఊహించారు. కానీ వెంకీ మామా యొక్క టైటిల్ కార్డులలో అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ భాగస్వామి అని తెరపై కనిపించినప్పుడు అందరూ షాక్ అయ్యారు. సురేష్ బాబు తన సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఎలా అమ్మారో తెలియక అందరూ షాక్ కి గురి అయ్యారు. అయితే తాజాగా ఆయనను మీడియా పలకరిస్తే ఓటీటీ వేదికలు ఇండస్ట్రీని తినేస్తాయి అన్నంత మాత్రాన అవి ఉండకూడదు అనేది ఆయన ఉద్ధేశం కాదట. థియేటర్లకు రప్పించేలా సినిమాలు తీయాలి. అమెజాన్ కి అమ్ముకునేలా కంటెంట్ ఉండాలి! అంటూ బాబు గారు మాట్లాడిన లాజిక్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిందని చెబుతున్నారు.

More Related Stories