English   

విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ గా జాన్వి

Vijay Devarakonda Jhanvi.jpg
2019-12-16 08:09:52

పూరీ ఇస్మార్ట్ శంకర్ హిట్టవ్వడంతో మాంచి ఊపు మీదున్నాడు. విజయ్ దేవరకొండతో సినిమా కూడా ప్లాన్ చేశారు. ప్రస్తుతం విజయ్‌ చేస్తున్న క్రాంతి మాధవ్‌ సినిమా విడుదలైన తర్వాత మొదలవ్వనుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యిందని, త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనున్నారని కూడా ప్రచారం మొదలయ్యింది.

అయితే కరణ్ జోహార్  ఫైటర్ సినిమాతో అసోసియేట్ కావడంతో ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్విని ఫైనలైజ్ చేశారట.  సినిమాల విషయంలో జాన్వికి కరణ్ జోహార్ ఒక గాడ్ ఫాదర్ లాంటివారు. ఎంట్రీ సినిమానే కాకుండా జాన్వి కెరీర్ లో ఎంచుకునే సినిమాల బాధ్యత కూడా కరణ్ చూస్తున్నారు. దీంతో ఈ సినిమాకు జాన్వితోనే సైన్ చేయించాడట. ఆమధ్య ఓ టీవీ షోలో జాన్వీ తన ఫేవరేట్ హీరో విజయ్ దేవరకొండ అని అతడితో కలిసి నటించాలనుందని చెప్పి పెద్ద చర్చకే తావిచ్చింది. ప్రస్తుతం ఈమె 'తక్త్' అనే పైలట్ బయోపిక్ మూవీలొ నటిస్తోంది.

త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ సినిమాను పూరీ తన సొంత బ్యానర్‌ లోనే నిర్మించనున్నాడు. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ బ్యానర్ లు ఈ సినిమాని నిర్మించనున్నాయి.

More Related Stories