పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చిన సమంత.

తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ను మించిన స్టార్ హీరో అరుదుగా ఉంటారు. ఆయనతో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోదు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తారు హీరోయిన్లు. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వస్తే సమంత అక్కినేని వదిలేసుకుంది అనే ప్రచారం జరుగుతోంది.
గతంలో ఇద్దరూ కలిసి అత్తారింటికి దారేది సినిమాలో నటించారు. అది ఇండస్ట్రీ హిట్ అయింది. అత్తారింటికి దారేది వచ్చిన ఆరేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం సమంత ముందు నిలిచింది. అయితే ఈమె ఈ అవకాశాన్ని వదిలేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్ గా కథలు పెంచుకుంటున్న సమంత అక్కినేని.. పవన్ కళ్యాణ్ తో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ప్రచారం జరుగుతుంది.
కొన్నేళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ పింక్ సినిమా రీమేక్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దిల్ రాజు బోనీకపూర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. తమన్ సంగీత దర్శకుడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటించబోతున్నారు. వేణు శ్రీరామ్ దర్శకుడు అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంత అక్కినేని అడిగితే ఆమె నటించను అని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో నివేదాథామస్ అంజలి అనన్య కీలకపాత్రలో తీసుకున్నారు. మరో హీరోయిన్ కోసం సమంత అక్కినేని అయితే బాగుంటుందని దర్శకనిర్మాతలు. అడగగా ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ వదులుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ ఈ చిత్ర సెట్లోకి అడుగు పెట్టనున్నాడు. ఒకే షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు వేణు శ్రీరామ్.