జగన్ మీద రాశి ప్రసంశల వర్షం

తెలుగు ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్స్ లో ఒకరు రాశి ఖన్నా. మొన్ననే వెంకీ మామ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ భామ మరో నాలుగు రోజుల్లో ప్రతి రోజు పండగే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాక విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. అయితే ఆమె ఇప్పుడు తాజాగా ఏపీ సీఎం జగన్ మీద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తాజాగా తెలంగాణాలో జరిగిన దిశ సంఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వం కీలకమైన చట్టం తీసుకొచ్చింది. ఆడవారి మీఅద్ ఎటువంటి లైంగిక వేధింపుల ఘటన జరిగినా మూడు వారాలలో న్యాయం జరిగేలా చట్టం చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ చట్టం గురించి రాశి ఖన్నా జగన్ మీద ప్రసంశల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం చాలా మంచి నిర్ణయమన్న రాశి, ఇటువంటి చట్టాలు ఉంటేనే రేపిస్టులు భయపడతారని అన్నారు. రేపిస్టులకు 21 రోజుల్లో శిక్ష విధించేలా చట్టం రూపొందించడం మంచి ఆలోచన అని ఆమె అన్నారు.
అంతే కాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్రాలు చాలా నేర్చుకోవాలన్నారు రాశి ఖన్నా. దేశంలో అత్యాచారాలకు సత్వర శిక్షలు ఉంటేనే భయం కలుగుతుందని, ఇటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకున్నా అభినందించాలి అని ఆమె అభిప్రాయపడ్డారు. రాశి మాత్రమే కాదు ఆమెతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ బిల్లుపై హర్షం వ్యక్తం చేశారు. అయితే చట్టం అయితే బలంగానే ఉంది కానీ అమలులోనే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. చూడాలి మరి ఈ చట్టం అమలు ఏమేరకు పని చేయనుందో ?