English   

గ్యాప్ లేకుండా రెడ్ షూటింగ్.. దుమ్ము లేపుతున్న రామ్..

 Ram Pothineni
2019-12-16 16:31:01

ఒక్కసారి షూటింగ్ మొదలు పెట్టడం ఆలస్యం అవ్వచ్చు. కానీ ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత మాత్రం అసలు ఆలస్యం కాదు. ఇప్పుడు హీరో రామ్ చేస్తున్నది ఇదే. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత  కొన్ని రోజుల వరకు రెస్ట్ తీసుకున్నాడు ఈ హీరో. అన్ని సెట్ చేసుకొని రెడ్ సినిమాను పట్టాలెక్కించిన తర్వాత అసలు రెస్ట్ తీసుకోవడం లేదు. ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమా తర్వాత రామ్ చేయబోయే సినిమా అంటే కచ్చితంగా అంచనాలు భారీగానే ఉంటాయి. పైగా ఆ సినిమా మాస్ ప్రేక్షకులను బాగా అలరించింది. దాంతో మరోసారి మాస్ ఆడియన్సే టార్గెట్ గా వస్తున్నాడు రామ్. ఈయన అంత ఈజీగా ఏ దర్శకుడితో కూడా కనెక్ట్ అవ్వడు. కానీ ఇప్పుడు అయ్యాడు. 

కొన్నేళ్లుగా ఈయన కిషోర్ తిరుమలతో బాగానే ట్రావెల్ చేస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి వరస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కలయికలో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉన్నది ఒకటే జిందగీ కమర్షియల్ గా ఫ్లాప్ అయినా కూడా రామ్ లోని నటుడిని మరో మెట్టు ఎక్కించింది. అందుకే ఇప్పుడు మూడోఛాన్స్ కూడా ఇచ్చాడు ఈయన. ఎమోషనల్ సినిమాలు చేస్తూ వస్తున్న కిషోర్ తిరుమల.. ఇప్పుడు రామ్ కోసం రూట్ మారుస్తున్నాడు. ప్రస్తుతం ఈయన కోసం క్రైమ్ థ్రిల్లర్ సిద్ధం చేస్తున్నాడు కిషోర్. దాని టైటిల్ రెడ్ అని ఫిక్స్ చేసాడు. 

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వేగంగా జరుగుతుంది. పూర్తిగా క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం మరోసారి లుక్ మార్చేస్తున్నాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈయన.. మరోసారి మాస్ ప్రేక్షకులనే టార్గెట్ చేస్తున్నాడు. తమిళనాట హిట్ అయిన తడమ్ సినిమాకు ఇది రీమేక్. క్లాస్ సినిమాలు చేసే దర్శకుడితో మాస్ సినిమా అంటేనే కాస్త ఆలోచించాల్సి వస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా విడుదల కానుంది. మొత్తానికి చూడాలిక.. రామ్, కిషోర్ కాంబినేషన్ లో రాబోయే ఆ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉండబోతుందో..? 

More Related Stories