English   

పవన్ కళ్యాణ్ రాకను మరోసారి కన్ఫామ్ చేసిన దిల్ రాజు..

Dil Raju
2019-12-16 17:04:21

ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పింక్ రీమేక్ పనులు చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఇందులో నటిస్తారా లేదా అని అభిమానులకు చాలా రోజుల నుంచి అనుమానాలు అయితే బాగానే ఉన్నాయి. ఆయన ఇప్పటి వరకు ఎక్కడ చెప్పింది లేదు.. పైగా రాజకీయాల్లో చాలా బిజీ అయిపోయాడు. ఇలాంటి సమయంలో అసలు ఆయన మళ్లీ సినిమాల్లో నటిస్తారా లేదా అనే మీమాంస అందరిలోనూ కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఈ అనుమానాలు అన్నింటికి తెరదించుతూ దిల్ రాజు మరో క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండగే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన దిల్ రాజు  అక్కడ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నానని.. 20 ఏళ్ల కల ఇప్పుడు నెరవేరబోతోందని చెప్పాడు దిల్ రాజు. దీన్ని బట్టి సినిమాలో నటించడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఒకటి రెండు కాదు ఏకంగా 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ రూపంలో అందుతుందని ప్రచారం జరుగుతోంది. డబ్బులు కాకుండా షేర్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాతగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పేరు కూడా పడుతుందని ప్రచారం జరుగుతుంది.

డిసెంబర్ లో ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టి జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి నుంచి షూటింగ్ లో పాల్గొంటాడు. వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ట్యూన్స్ కూడా సిద్ధం చేస్తున్నాడు తమన్. బోనీ కపూర్తో కలిసి దిల్ రాజు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంజలి అనన్య నివేద థామస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎంపికయ్యారు. 
 

More Related Stories