English   

రూలర్ సెన్సార్ టాక్.. బాలయ్య హిట్ కొడతాడా..

Balakrishna Ruler Movie.jpg
2019-12-16 22:19:01

బాలకృష్ణ సినిమా అంటే చాలు మాస్ ప్రేక్షకులకు పండగే. ఇప్పుడు కూడా రూలర్ సినిమాతో ఇదే చేయాలని చూస్తున్నాడు ఈ హీరో. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. దీనికి యు బై ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమాలో మాస్ కు తోడు సోనాల్ చౌహాన్ బికినీ అందాలు కూడా ఉండటంతో యు సర్టిఫికేట్ కు దూరమయ్యాడు బాలయ్య. జై సింహా సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన కేయస్ రవికుమార్‌తో కలిసి ఈయన మరోసారి వస్తున్నాడు. రూలర్ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. దానికితోడు జగన్ పై అదిరిపోయే పంచులు కూడా వేసాడు బాలయ్య. ఇవన్నీ సినిమాపై భారీగానే అంచనాలు పెంచేస్తున్నాయి.

ఇదిలా ఉంటే సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే రావడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు దర్శక నిర్మాతలు. రూలర్ సినిమా అంతా బాలయ్య ప్రధానంగానే సాగుతుందని తెలుస్తుంది. ఆయనపైనే ఫోకస్ చేసాడు దర్శకుడు. మనం బాలయ్యను బాగా చూసుకుంటే చాలు.. ఆయనే ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులను చూసుకుంటాడులే అనే ధైర్యం కేయస్ రవికుమార్‌లో కనిపిస్తుంది. అందుకే కాబోలు బాలయ్యపైనే ట్రైలర్ అంతా కట్ చేసాడు రవికుమార్. ఈ చిత్రం ట్రైలర్చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ వచ్చేసింది. ఒంటిమీక ఖాకీ డ్రస్ ఉన్నపుడే బోన్‌లో పెట్టిన సింహాన్ని.. ఒక్కసారి అది తీసేస్తే బయటికి వచ్చిన సింహాన్ని.. ఇక వేటే అని టీజర్ లో చెప్పిన బాలయ్య ఇప్పుడు ఇది దెబ్బతిన్న సింహంరా.. అంత తేలిగ్గా చావదు.. వేటాడి వెంటాడి చంపుద్ది అంటూ రెచ్చిపోయాడు.

రైతుల నేపథ్యంలో రూలర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కేయస్ రవికుమార్. ట్రైలర్ అంతా అదే ఎక్కువగా హైలైట్ చేసాడు. ఎమోషన్స్ తో పాటు మాస్ యాక్షన్ డ్రామా కూడా ఉండటంతో ఫ్యాన్స్ కు పిచ్చెక్కడం ఖాయం. కచ్చితంగా మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడానికి సిద్ధమైపోతున్నాడు బాలయ్య. ఎన్టీఆర్ బయోపిక్ దారుణంగా నిరాశ పరచడంతో ఇప్పుడు ఈయన ఆశలన్నీ రూలర్ సినిమాపైనే ఉన్నాయి. తక్కువ టైమ్‌లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు కేయస్ రవికుమార్. మరోసారి జై సింహా కాంబినేషన్‌లోనే సినిమా వస్తుంది.

సోనాల్ చౌహాన్, వేదిక ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారు. ప్రతిరోజూ పండగే సినిమాతో పాటు కార్తి ఖైదీ, సల్మాన్ ఖాన్ దబంగ్ 3 సినిమాలు డిసెంబర్ 20న విడుదల కానున్నాయి. 

More Related Stories