English   

దర్బార్ ట్రైలర్.. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈజ్ బ్యాక్..

darbar
2019-12-17 04:59:39

స‌ర్కార్ త‌ర్వాత మురుగ‌దాస్ తెర‌కెక్కిస్తున్న సినిమా ద‌ర్బార్. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. ఈయ‌న రాజకీయాల్లో బిజీ అవుతాడో లేదో తెలియదు కానీ సినిమాల్లో మాత్రం చాలా బిజీ అవుతున్నాడు. 70 ఏళ్ళ వయసులో ఈ జోరు చూసి కుర్ర హీరోలు కూడా కుళ్లుకుంటున్నారు. రెండేళ్ల కింది వరకు మూడేళ్లకో సినిమా చేయడానికి కూడా ఇబ్బంది పడ్డ రజనీకాంత్ ఇప్పుడు మాత్రం ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఇలా జోరు పెంచడం వెనక కారణాలు ఎవరికీ అర్థం కావడం లేదు. వరసగా సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో మెప్పించలేకపోతున్నాడు సూపర్ స్టార్. అయినా కూడా ఆయన ఇమేజ్ తో వరసగా దర్శకులు కథలు సిద్ధం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మురగదాస్ సినిమాతో బిజీ అయిపోయాడు రజనీకాంత్. ఈ సినిమాపై భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు ర‌జినీ. తాజాగా దర్బార్ ట్రైలర్ విడుదలైంది. ఇది చూసి తర్వాత సినిమా కచ్చితంగా హిట్ కొట్టేలా కనిపిస్తుంది.

 

కొన్నేళ్లుగా సరైన విజయం కోసం చూస్తున్న రజినీకి ఆ లోటు తీర్చేలా కనిపిస్తుంది దర్బార్. ఇందులో న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా రజనీకాంత్ న‌టిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే రజినీ జోరుకు వామ్మో అనుకోవాల్సిందే. అసలు ఈ మధ్య కాలంలో ఇంత స్టైలిష్ గా ఆయన కనిపించింది లేదు. కుర్ర దర్శకుల కోసం కావాల్సినట్లుగా మారిపోతున్నాడు సూపర్ స్టార్. ఈ చిత్రంలో ముంబై పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు రజిని. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి దర్బార్ లో విలన్ గా నటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ పెద్దగా రెస్పాన్స్ తెచ్చుకోకపోవడంతో ట్రైలర్ చాలా పవర్ ఫుల్ గా కట్ చేసాడు మురుగదాస్. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ట్రైలర్ చూస్తుంటేనే విషయం అర్థమైపోతుంది. పోలీస్ డ్ర‌స్ లో మరోసారి రెచ్చిపోయాడు సూపర్ స్టార్. నయనతార కూడా చాలా అందంగా ఉంది. ఇక యాక్షన్ సీన్స్ కూడా కుమ్మేసాడు రజినీ. ఇది చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. రజనీకాంత్ ఖాకి డ్రెస్ వేసుకొని మూడు దశాబ్దాలు దాటిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు సూపర్ స్టార్. యామ్ ఏ బ్యాడ్ కాప్ అంటూ స్టైల్ గా రజినీ చేస్తున్న రచ్చకు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. దానికి తోడు మురుగుదాస్ సినిమా అంటే కచ్చితంగా సందేశం ఉంటుందని గ్యారెంటీ ఉంది. సర్కార్ లాంటి సినిమా తర్వాత మురుగుదాస్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. పేట సినిమా కూడా యావరేజ్ దగ్గరే ఆగిపోవడంతో ఇప్పుడు మురుగుదాస్ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు సూపర్ స్టార్. మరి ఈయన ఆశలను మురుగుదాస్ ఎంతవరకు నిలబెడతాడో చూడాలి.

More Related Stories