అల స్పెషల్ సాంగ్...ఆమె చేస్తున్నట్టేనా

అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అల.. వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, పాటలు సినిమా మీద ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సంక్రాంతి రేసులో ఉన్న ఈ సినిమాకి ఏదో ఒక స్పెషల్ ఉండాలని భావించిన త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పాట కోసం భారీ బడ్జెట్‌నే కేటాయించిన మేకర్స్ అందులో ఆడి పాడి అలరించమని కాజల్ అగర్వాల్ ని సంప్రదించినట్లు వినిపిస్తోంది. ఆమె ఈ పాటలో నర్తిస్తే ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతుందని, ఇందుకు ఆమెకు భారీ ఆఫర్‌నే ఇచ్చారట. త్రివిక్రమ్ ఇచ్చిన ఆఫర్ కూడా టెంప్టింగ్ గా వుండటంతో కాజల్ ఓకే చెప్పేసినట్టు వార్తలు వస్తున్నాయి.