పవన్ పింక్ గురించి ఆసక్తికర అప్డేట్

పవన్ కళ్యాణ్ రీఎంట్రీగా పింక్ సినిమా తెరకెక్కుతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద అధికారిక ప్రకటన లేకున్నా ఆయన హీరోగా నటిస్తాడని అందరూ నమ్ముతున్నారు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఎంసీఏ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకి గాను పవన్ కళ్యాణ్ కేవలం 21 రోజులు కాల్షీట్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ రాజకీయాలలో యాక్టివ్ అవ్వాలని భావిస్తున్న తరుణంలో పవన్ సినిమాకి కేవలం 21 రోజులు కాల్షీట్లు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమాలో నివేధా థామస్ ముఖ్యపాత్ర పోషిస్తునట్టు తెలుస్తోంది. హిందీలో తాపసీ పోషించిన పాత్రను ఇక్కడ నివేదా పోషిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ‘అల వైకుంఠపురములో’ చిత్రం నుండి ‘సామజవరగమన’ పాట బయటికొచ్చిందో అప్పటి నుండి నిర్మాతలు థమన్ మీద గట్టిగా ఫోకస్ పెట్టారు. అలా పవన్ సినిమా రావడంతో థమన్ రేంజ్ ఒక్కసారే పెరిగిపోయిందని అంటున్నారు.