English   

సెన్సార్ టీం మీద వర్మ పరువు నష్టం దావా

RGV
2019-12-17 11:09:23

సెన్సార్ టీం మీద పరువు నష్టం దావా వేస్తానన్నారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు ..సెన్సార్ సభ్యులు నష్టం కలిగించారని ఆరోపించిన ఆయన కావాలనే కొందరు సినిమాను అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. సినిమా రెండు వారాలు ఆలస్యంగా విడుదల కావడం వల్ల నిర్మాతకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు వర్మ. సినిమా విడుదలకు అడ్డుపడిన వారిపై 20కోట్లు పరువు నష్టం దావా వేయనున్నట్లు చెప్పాడు ఆర్జీవీ. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు సెన్సార్ బోర్డు వల్ల రెండు వారాలు ఆలస్యంగా విడుదలైంది. దీని వెనక ఎవరున్నారో విచారణ చేయగా కొన్ని ఆధారాలు లభించయన్న వర్మ వాటి ఆధారంగా వారిపై తగిన చర్యలు తీసుకునున్నట్టు పేర్కొన్నారు.

More Related Stories