చిరు కొరటాల సినిమా రిలీజ్ డేట్ లాక్

సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్లో నటించనున్నట్టు ప్రచారం జరిగింది. చిరంజీవి సరసన హీరోయిన్ త్రిష నటించనున్నట్టు స్వయానా త్రిష ప్రకటించుకుంది. ఇక ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నట్టు చెబుతున్నారు. అయితే హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం కొరటాల ఈ సినిమాని వీలయినంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న విడుదల చేయాలని ప్లాన్ చేస్తోన్నట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ ఇదేనంటూ లేటెస్ట్గా ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ లుక్‌లో చిరంజీవి ఒత్తైన మీసకట్టుతో వైట్ డ్రెస్‌లో సూపర్‌గా ఉన్నారు. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారని.. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు సమాచారం.