English   

వర్మ గారూ మీరు ఇంక సినిమాలు చేయొద్దు సర్.. 

RGV
2019-12-17 14:38:47

రాంగోపాల్ వర్మ అనే దర్శకుడు ప్రేక్షకులు మరిచిపోయి చాలా రోజులైంది. కాకపోతే ఆయన్ని ఇంకా నిర్మాతలే గుర్తు పెట్టుకున్నారు. అందుకే సినిమాలు ఇంకా వస్తున్నాయి. కథను నమ్ముకోవడం మానేసి కేవలం కాంట్రవర్సీలు మాత్రమే నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు వర్మ. ఈ మధ్య ఆయన తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో అసలు కథ లేకుండా కేవలం పెద్దమనుషుల మొహాలు మాత్రమే వాడుకుంటూ ఆయన చేసినవి వెకిలి కామెడీకి ప్రేక్షకులు మొహం మీద గుద్దినట్లు సమాధానం చెప్పారు. సినిమా కనీసం ఓపెనింగ్స్ కూడా తీసుకు రాలేదంటే వర్మ పరిస్థితి ఎంత దిగజారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఒక్క సినిమానే కాదు గతంలో ఇంకా చాలా సినిమాలు కూడా ఇలాగే చేశాడు వర్మ. ఈ ఏడాది ఆయన తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో విషయం కాస్త అయినా ఉంది.. అందుకే ఆ సినిమా ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకుండా కేవలం తెలంగాణలో విడుదలైన కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విషయంలో కూడా ఆయన కాస్త కథపై దృష్టి పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అంటున్నారు అభిమానులు. కానీ కథ గురించి ఆలోచించడం మానేసి చాలా రోజులైంది. ఎప్పటికప్పుడు ఆయనపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ గా చేసుకొని ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులకు అసలు నచ్చడం లేదు. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్, కె ఏ పాల్ లాంటి వాళ్లను కూడా తీసుకొచ్చి కామెడీ చేస్తున్నాడు వర్మ. ఇలా ఏం చేసినా ఎన్ని చేసినా ప్రేక్షకులు ఆయన్ను నమ్మడం మాత్రం మానేశారు.
 

More Related Stories