English   

అ.. సినిమా అవార్డు కోసం విదేశాలు వెళ్లిన నాని.. 

Nani AWE
2019-12-17 15:08:46

తెలుగు ఇండస్ట్రీ ఒకప్పటిలా లేదు. ఇప్పుడు బాలీవుడ్ కు సమానంగా మనం కూడా రచ్చ చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ కూడా తెలుగు ఇండస్ట్రీని చూసి ఇప్పుడు కొన్ని ఫాలో అవుతుంది. ఇక అవార్డుల విషయంలో కూడా మన తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. గత ఏడాది ప్రకటించిన నేషనల్ అవార్డుల్లో నాని నిర్మించిన అ.. సినిమాకు రెండు అవార్డులు వచ్చాయి. స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆ సినిమాకు ఈ అవార్డు వచ్చింది. దాంతో అప్పట్లోనే ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో బాగా చర్చ జరిగింది. కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాతో పూర్తిస్థాయి నిర్మాతగా మారాడు నాని. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ స్థాపించి అందులోనే సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు వచ్చిన అవార్డు అందుకోవడానికి విదేశాలకు వెళ్లారు నాని దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ఇదిలావుండగా నాని ప్రస్తుతం వాల్ పోస్టర్ సినిమాపై విశ్వక్ సేన్ హీరోగా హిట్ అనే సినిమాని నిర్మిస్తున్నాడు. ఆయన కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

More Related Stories