English   

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్..

sri
2019-12-18 04:58:39

శ్రీ రెడ్డి.. ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఎవరో ఒకర్ని టార్గెట్ చేస్తూ తన పబ్బం గడుపుకుంటుంది ఈ కాంట్రవర్సీ క్వీన్. ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది నోటికొచ్చినట్లు తిడుతూ ఇష్టమొచ్చినట్లు చేస్తుంటుంది శ్రీ రెడ్డి. ఇక ఇప్పుడు ఈమె ఏకంగా రాజకీయాల్లో కూడా వేలు పెట్టేస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడా శ్రీ రెడ్డి జాడ కనిపించడం లేదు. ఇక్కడ ఆమె చేసిన రచ్చకు  ఎవరు ఎప్పుడు టార్గెట్ చేస్తారో తెలియక  వెళ్లి చెన్నై లో ఉంటుంది శ్రీ రెడ్డి. ఇక ఇప్పుడు అక్కడి నుంచే సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది శ్రీ రెడ్డి. తాజాగా జగన్ పాలన గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. జై జగన్ అంటూ జగన్ కు జై కొట్టిన శ్రీ రెడ్డి జగన్ పాలనను ఆకాశానికి ఎత్తింది.

జగన్ పాలన అద్భుతంగా ఉందని కితాబిచ్చింది. జగన్ విజన్ ఉన్న నాయకుడు అని.. ఆయన తన పాలనలో తండ్రిని మించిపోయారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి. జగన్ మంచి వ్యక్తి అని.. మంచి వ్యక్తి ఆలోచనలు ఎప్పుడు మంచిగానే ఉంటాయని.. కానీ కొందరు జగన్ పాలనను చూసి ఓర్వలేకపోతున్నారని.. అసలు ఆయన పాలనపై కామెంట్స్ చేయడానికి సిగ్గులేదా అని ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభివృద్ధి కోసం  వైయస్ జగన్ ఎన్నో పథకాలు తీసుకొచ్చారని..  ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందని శ్రీ రెడ్డి తెలిపింది. ఒకవైపు  ముఖ్యమంత్రి జగన్ ను ఆకాశానికి ఎత్తిన శ్రీ రెడ్డి.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను మరోసారి టార్గెట్ చేసింది. కనీసం రాయలేని విధంగా మాటల్లో చెప్పలేని విధంగా బూతులు వాడి పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శించింది శ్రీ రెడ్డి. అసలు ఈమెకు ఆయన అంటే ఎందుకు అంత పగ అంటూ అభిమానులు కూడా విమర్శిస్తున్నారు. ఏదేమైనా కూడా రాజకీయాల్లో కూడా తన ముద్ర వేయాలని చూస్తుంది శ్రీ రెడ్డి.

More Related Stories