English   

రంగమార్తాండ లో రంగమ్మత్త

anu
2019-12-18 05:51:42

 జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన అన‌సూయ న‌టిగా కూడా రాణిస్తోంది. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్స్ చేసే కామెడీ కంటే అనసూయ అందచందాల కోసమే చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తనదైన యాంకరింగ్‌తో గుర్తింపు పొందిన అనసూయ ఆ క్రేజ్‌తోనే వరుసగా సినిమా అవకాశాలను పట్టేస్తోంది. క్షణం, రంగస్థలం లాంటి సినిమాల్లో నటించిన అనసూయ నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. యాత్ర సినిమాలో చేసింది ఒకటి రెండు సీన్లలో అయినా తన నటనానుభవం చూపించింది అనసూయ. ఆ తర్వాత అన‌సూయ‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు కూడా వార్తలు వినిపించాయి. మెగాస్టార్‌ చిరంజీవి నటించబోయే చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నదని అన్నారు కానీ అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం రంగమార్తాండలో ఆమెకు ఒక రోల్ కన్ఫాం అయిందట. ఈ విషయాన్ని స్వయానా దర్శకుడే ప్రకటించాడు. అనసూయ ఫొటోను షేర్‌ చేస్తూ ఆమెను ఉద్దేశించి ‘ఎప్పుడూ నవ్వుతూ ఉండే అనసూయతో పనిచేయడం సంతోషంగా ఉంది. రంగమార్తాండలో అనసూయ ఓ స్పైసీ పాత్రలో కనిపించబోతుంద’ని ట్వీట్‌ చేశాడు వంశీ. ఇందులో ఆమె చేతినిండా గాజులు, ఆభరణాలు ధరించి చీరలో దర్శనమిచ్చింది. ‘రంగస్థలం’లోనూ పూర్తిగా చీరలోనే రంగమ్మత్తలా కనిపించిన అనసూయ ఇప్పుడు ‘రంగమార్తాండ’లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేదాకా ఆగాల్సిందే నండోయ్.

 

More Related Stories