English   

మిర్చి హీరోయిన్ పెళ్లైపోయింది.. అమెరియన్ అబ్బాయితో.. 

 Richa Gangopadhyay marriage
2019-12-18 11:18:03

కొందరు హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీకి మెరుపు తీగల్లా వచ్చిపోతుంటారు. అలాంటి వాళ్ళలో రిచా గంగోపాధ్యాయ కూడా ఉంటుంది. లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. కేవలం నాలుగేళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో ఉంది. ఆ తర్వాత మళ్ళీ అమెరికాకు చదువుకోవడానికి వెళ్ళిపోయింది. అవకాశాలు వస్తున్నా కూడా పట్టించుకోకుండా తనకు చదివే ముఖ్యం అంటూ యూఎస్ చేరుకుంది ఈ భామ. అయితే సినిమాలకు దూరమైన అభిమానులకు మాత్రం దూరం కాలేదు రిచా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన విషయాల గురించి చెబుతూనే ఉంది. ఇప్పుడు కూడా మరో ఆసక్తికరమైన విషయం అభిమానులతో పంచుకుంది. రిచా గంగోపాధ్యాయ పెళ్ళి అయిపోయింది. చాలా రోజులుగా ప్రేమలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ జియో లాంజెల్ ను పెళ్లి చేసుకుంది రిచా గంగోపాధ్యాయ. భారతీయ హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి నిర్వహించారు. ఆమె పెళ్లికి కేవలం వారి కుటుంబ సభ్యులు జో కుటుంబ సభ్యులు మాత్రమే హజరయ్యారు. ఆరేళ్ల కింద నాగార్జునతో నటించిన భాయ్ సినిమా తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు. ఇక జీవితంలో సినిమాలు చేయనని కొన్ని రోజులు అలా నటించాలనిపించింది వచ్చాను.. నటించాను.. వెళ్లిపోయాను అంటూ ఇండస్ట్రీకి సెలవిచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి ఆమె పెళ్లితో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.

More Related Stories