English   

రాజశేఖర్‌కు మరో దెబ్బ.. లైసెన్స్ లేకుండా రూల్ అతిక్రమించి..

Rajasekhar
2019-12-18 12:10:34

హీరో రాజశేఖర్ మాటిమాటికి కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటున్నాడు. ఈయన కారుకు కొన్ని రోజుల కింద యాక్సిడెంట్ అయింది. అందులో ఆయన కూడా ఉన్నాడు.. అదృష్టం బాగుండి సేఫ్ గా బయటపడ్డాడు. అయితే ఆ యాక్సిడెంట్ కు కారణం మాత్రం ర్యాష్ డ్రైవింగ్ అని తర్వాత తేలింది. అందుకే ఆయన డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసారు పోలీసులు. కానీ ఇప్పుడు అసలు విషయం బయటికి వచ్చింది. 

ఆయన అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనం నడుపుతున్నట్టు నిర్దారించారు అధికారులు. ఈ మధ్యే ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ కారు ప్రమాదం తర్వాత దాన్ని తీవ్రమైన తప్పుగా పరిగణిస్తూ ఆర్టీఏ ఆయన లైసెన్స్‌ను క్యాన్సిల్ చేసింది. కానీ అసలు విషయం ఏంటంటే జూన్ 18, 2012న రాజశేఖర్ తన లైసెన్స్ రెన్యువల్ చేయించుకోగా.. దాని వాలిడిటీ జూన్ 17, 2017తో ముగిసింది. కానీ ఆ తర్వాత ఈయన రెన్యువల్‌కి దరఖాస్తు చేసుకోలేదు.. చేయించుకోనూలేదు. అంటే ఒక్కమాటలో చెప్పాలంటే లైసెన్స్ లేకుండానే ఇన్ని రోజుల నుంచి కార్ నడుపుతున్నాడు రాజశేఖర్. 

నెల రోజుల కింద ఔటర్ రింగ్ రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి గురయ్యాడు రాజశేఖర్. దీంతో టోలీచౌకీ ఆర్టీఏ అధికారులు నవంబర్ 29, 2019 నుంచి మే 28, 2020వరకు రాజశేఖర్ లైసెన్స్ రద్దు చేశారు. ఈ క్రమంలోనే అధికారులు లెక్కలు చూస్తుంటే అసలు విషయం బయటపడింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే డ్రైవింగ్ చేస్తున్నాడని తేలడంతో మోటారు వాహనాల చట్టం 181 సెక్షన్‌ కింద ఆయనపై కేసు నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. మొత్తానికి రాజశేఖర్ కాంట్రవర్సీలు మామూలుగా లేవుగా. 

More Related Stories