English   

క్రేజీ కాంబో సెట్ చేసిన దిల్ రాజు

 Vijay devarakonda
2019-12-18 14:15:19

దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతతో పనిచేయాలని దాదాపు హీరోలందరూ ఉత్సాహం చూపిస్తారు. దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తే ప్రొడక్షన్ మాత్రమే కాక సినిమా స్క్రిప్టు నుంచి రిలీజ్ అయ్యాక పడే పోస్టర్ దాకా అంతా తనదే బాధ్యత అన్నట్లుగా ఆయన జాగ్రత్తలు తీసుకుంటాదు కాబట్టి హీరోలు షూటింగ్ కి వచ్చి కూల్ గా వెళ్లిపోవచ్చు. యావరేజ్ సినిమాని కూడా సూపర్ హిట్ గా నిలపగల సత్తా ఉన్న నిర్మాత కావడంతో హీరోలకు ఆయనతో పని చేయటం సుఖం. అయితే ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ మాత్రం ఆయనతో సినిమా చేయలేదు. అయితే ఎట్టకేలకు ఆ ముహూర్తం కుదిరింది. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించాడు. విజయ్ దేవరకొండకు ఇది 12వ సినిమా. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా 2020 ఫిబ్రవరి 14న రిలీజ్‌ కానుంది.  

More Related Stories