English   

అయ్యయ్యో ఆర్ఆర్ఆర్ టైటిల్ పోయెనే 

RRR
2019-12-18 14:31:38

బాహుబలి లాంటి ప్యాన్ ఇండియా లెవల్ సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి చాలా రోజులయ్యింది. ఇప్పటి వరకు దాదాపుగా 70 శాతం వరకు షూటింగ్ కూడా పూర్తయింది. బాహుబలి వంటి సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడం, ఇండస్ట్రీలో రెండు పెద్ద కుటుంబాలకు చెందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా మీద అటు ట్రేడ్ వర్గాలతో సహా ఇటు సాధారణ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా టైటిల్ ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. 

నిజానికి సినిమా మొదలు పెట్టె ముందు జక్కన్న , చరణ్, ఎన్టీఆర్ పేర్లు కలిసి వచ్చేలాగా ఆర్ఆర్ఆర్ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. అయితే ఆ వర్కింగ్ టైటిల్ కే అసలు టైటిల్ అంత పేరు రావడంతో ఈ సినిమా టైటిల్‌ కోసం రాజమౌళి ప్రేక్షకులకు ఓ పోటీ పెట్టాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వర్కింగ్‌ టైటిల్‌కు సరిగ్గా సరిపోయేలా పూర్తి పేరును సూచిస్తే బాగున్న వాటిలో నుంచే ఓ టైటిల్‌ను ఖరారు చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో సినీ ప్రియుల నుంచి అప్పట్లో రకాల పేర్లు వినిపించినా వీటిలో ఎక్కువ మంది సజెస్ట్ చేసింది ఎక్కువ మందికి నచ్చింది ‘రామ రావణ రాజ్యం’. ఈ టైటిల్‌నే జక్కన్న ఫిక్స్‌ చేయబోతున్నాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. 

అయితే ఇప్పుడీ టైటిల్‌ను వి3 ఫిలింస్‌ అనే సంస్థ తమ పేరిట రిజిస్టర్‌ చేయించేసుకోవడం సంచలనంగా మారింది. ప్రేక్షకుల్లో ఈ పేరుకున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని సదరు సంస్థ జక్కన్న కంటే ముందే జాగ్రత్త పడి ఫిలిం ఛాంబర్‌లో ముందుగానే దీన్ని రిజిస్టర్‌ చేయించేసుకుందట. అలా జక్కన్న టైటిల్‌ను వి3 ఫిలింస సంస్థ ముందుగానే తన తెలివితో కొట్టేసిందన్న మాట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు రాజమౌళి రామ రౌద్ర రుశితం అనుకున్తున్నాడని కూడా వార్హ్తలు వచ్చాయి. చూడాలి మరి జక్కన్న ఏమి చేయనున్నాడో ?  

More Related Stories