English   

జయసుధ కొత్త అవతారం...బయట పెట్టిన వర్మ

Jayasudha
2019-12-18 15:17:14

దక్షిణాదిలో సహజనటిగా స్టార్ ఇమేజ్ అందుకుంది నటి జయ సుధ. అంటే ఆమె ఏమైనా సినిమా కోసం కొత్త పాత్ర చేస్తుంది అనుకునేరు కాదండోయ్. ఇప్పటి దాకా నటిగా మెప్పించిన ఆమె ఇక నుండి సింగర్ గా కూడా మెప్పించ నుంది. అదేమిటి అనుకుంటున్నారా ? అయితే ఈ స్టోరీ చదవండి. హిందూ కుటుంబంలోనే జన్మించిన ఆమె కొన్ని రోజుల క్రితం క్రిస్టియానిటీ తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ పండగ రానుంది. ఈ సందర్భంగా ఆమె జీసస్‌పై పాడిన ఓ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా ఈ వీడియో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. జయసుధ కొత్త అవతారం అంటూ ట్వీట్ చేశారు. సినిమాల్లోనే కాకుండా ఇటు రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారుజయసుధ. వైఎస్ హయంలో ఎమ్మెల్యేగా ఉన్న ఈమె.... రాష్ట్రం రెండుగా చీలిన తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే మొన్నటి ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీలో ఆమె చేరారు. అతడికే తమ మద్దతు తెలిపారు. కొడుకుతో సహా వెళ్లి జగన్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు జయ. జయసుధ తన కెరీర్ లో దాదాపు 300 కు పైగా సినిమాల్లో నటించారు, అందులో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలు ఉన్నాయి.  

More Related Stories