English   

నటుడు బెనర్జీకి అరుదైన గౌరవం

actor
2019-12-18 19:35:08

సీనియర్‌ నటుడు బెనర్జీ ప్రధాన పాత్రలో రాజేష్‌ టచ్‌రివర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రక్తం'. ఈ సినిమా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ అమెరికా ఇండీ గేదరింగ్‌ ఫారిన్‌ డ్రామా ఫీచర్స్‌ సెగ్మెంట్‌లో (2017) పలు అవార్డులు సాధించింది. ఆ ఫిలిం పెస్టివల్‌లో ఐదు పురస్కారాలను 'రక్తం' సినిమా అందుకుంది. నక్సలైట్‌ బ్యాక్‌ డ్రాప్‌లో హింసాత్మక మార్గంలోనే నైతిక విలువలు గురించిన చెప్పిన సినిమా ఇది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్‌ నటుడు బెనర్జీ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక తాజాగా ముంబైలోని లోనావాలాలో ఇటీవల ప్రతిష్టాత్మకంగా జరిగిన వరల్డ సినీ ఫెస్ట్ లిఫ్ట్ ఇండియా ఫిల్మోత్సవంలో  రక్తం చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా తెలుగు బెనర్జీ  అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు బెనర్జీ కావడం గమనార్హం. ఈ ‘ర‌క్తం’ సినిమాకి గాను సెన్సార్ స‌భ్యులతో ఇబ్బందులు తలెత్తాయి. ఇద్దరు విప్లవ‌కారుల మ‌ధ్య జ‌రిగే సీరియ‌స్ సంభాష‌ణలో సెన్సార్ వారికీ సెక్స్‌వ‌ల్‌గా త‌ప్పుదారి ప‌ట్టించే విధంగా ఉందని ఆ దర్శకుడు ఆరోపించారు. సామాజిక ప‌రివ‌ర్తన కోసం ర‌క్తం చిందించ‌డం అవ‌స‌ర‌మా? అనే సెన్సిబుల్‌ క‌థాంశంతో సాగే ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు చెప్పిన అభ్యంత‌రాలు చిత్ర క‌థ‌ను చిన్నాభిన్నం చేసేలా ఉన్నాయని అందుకే ట్రిబ్యున‌ల్‌కు వెళుతున్నానని రాజేష్ టచ్ రివర్ అప్పట్లో సంచలనం రేపారు.

 

More Related Stories