English   

విజయ్ దేవరకొండ కెరీర్ మళ్లీ సెట్ అయిపోయినట్లేనా..

vijay
2019-12-19 05:08:00

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకు అరాచకమైన ఫాలోయింగ్ వచ్చేసింది. నాని, నాగ చైతన్య లాంటి హీరోలను కూడా తన ఇమేజ్ తో దాటేసాడు విజయ్. దానికితోడు గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాలతో మనోడి ఇమేజ్ మరింత పెరిగిపోయింది. కానీ వెంటనే డియర్ కామ్రేడ్ సినిమా డిజాస్టర్ కావడంతో విజయ్ జోరు కాస్త తగ్గింది. ఇప్పుడు సరైన సినిమా పడితే కానీ మళ్లీ ఈయన కెరీర్ గాడిన పడదు. ఇలాంటి సమయంలో పెద్దగా అంచనాలు లేని వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో వస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇది కానీ తేడాకొడితే విజయ్ కూడా అందరిలాంటి హీరో అయిపోతాడు. కానీ ఇలాంటి సమయంలో విజయ్ కోసం వరసగా స్టార్ డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఫైటర్ సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ చిత్రం ప్యాన్ ఇండియన్ మూవీగా రాబోతుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నాడు పూరీ. ఇక ఈ చిత్రం ఇలా ఉండగానే శివ నిర్వాణతో తన 12వ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. నాని టక్ జగదీష్ సినిమా అయిపోయిన తర్వాత విజయ్ సినిమా ఉండబోతుంది. ఈ రెండు సినిమాలతో మళ్లీ కెరీర్ గాడిన పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇవి కానీ హిట్ అయ్యాయంటే మళ్లీ విజయ్ జోరు అందుకోవడం ఎవరితరం కాదు.

More Related Stories