English   

బాలయ్యకు థియేటర్స్ దొరకడం లేదా.. ఏంటి పరిస్థితి..

ruler
2019-12-19 05:18:30

అదేంటి.. నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సినిమాకు థియేటర్స్ కొరత ఉందా..? అసలు నమ్మడానికి ఇది నిజమేనా..? మాస్ హీరోకు కేరాఫ్ అడ్రస్ లాంటి బాలయ్యకు థియేటర్స్ లేకపోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? నమ్మడం కాస్త కష్టమే అయినా కూడా ఇదే నిజం. బాలయ్య సినిమాకు సరిపోయే స్క్రీన్స్ మాత్రం ఇప్పుడు దొరకడం కష్టంగా మారుతుంది. ఈయన హీరోగా కె.ఎస్ రవికుమార్ తెరకెక్కించిన రూలర్ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. అదే రోజు బాలయ్యతో పాటు మరో ముగ్గురు హీరోలు కూడా వస్తున్నారు. అన్నీ క్రేజీ సినిమాలే కావడం ఇక్కడ గమనార్హం. అందులో సాయి తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే సినిమాకు 800 థియేటర్స్ ఇస్తున్నారు. దానివెనక అల్లు అరవింద్ ఉండటంతో థియేటర్స్ కొరత లేదు.

ఇక దొంగ సినిమాకు కూడా మంచి స్క్రీన్ లెక్క దొరికింది. కార్తి ఖైదీ తర్వాత చేసిన సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇక దబంగ్ 3 కూడా సల్మాన్ ఖాన్ భారీగానే థియేటర్స్ అందుకుంటున్నాడు. హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలవుతుండటంతో రెండు భాషల్లోనూ భారీగా థియేటర్స్ అందుకుంటున్నాడు కండలవీరుడు. ఇంతమంది మధ్యలో బాలయ్యకు అనుకున్న స్క్రీన్ సంఖ్య రాలేదని తెలుస్తుంది. పైగా రూలర్ బిజినెస్ కూడా అనుకున్నంత స్థాయిలో జరగలేదని తెలుస్తుంది. ఇక థియేటర్ల పరిస్థితి అదేవిధంగా ఉందని అంటున్నారు. వెంకీ మామ కంటే తక్కువ థియేటర్స్ లోనే రూలర్ రాబోతుంది. మొత్తానికి తక్కువ అంచనాలు.. తక్కువ స్క్రీన్స్ తో వస్తున్న బాలయ్య పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కుమ్మేయడం ఖాయం. ఆ తర్వాత థియేటర్స్ వాటంతటవే నడుచుకుంటూ కాదు.. పరిగెత్తుకుంటూ బాలయ్య దగ్గరికి వస్తాయి.

More Related Stories