English   

హాస్య నటుడు అలీకి మాతృవియోగం..

 Comedian Ali
2019-12-19 13:15:42

ప్రముఖ హాస్య నటుడు బుల్లితెర హోస్ట్ కమెడియన్ అలీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతూన్ బీబీ అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న అలీ తల్లి స్వస్థలం రాజమహేంద్రవరంలోనే మరణించారు. ప్రస్తుతం కమెడియన్ అలీ షూటింగ్ పనిమీద రాంచీలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరాడు ఈ కమెడియన్. అమ్మ అంటే ప్రాణంగా చూసుకుంటాడు అలీ. ఇప్పటికీ ఇంత బిజీగా ఉన్నా కూడా ఖాళీ సమయం చేసుకొని మరి అమ్మ దగ్గరికి వెళ్లి చాలా సమయం కేటాయిస్తుంటారు అలీ. బీబీ అంతక్రియలు హైదరాబాదులోనే జరగనున్నాయి. ఆమె భౌతిక కాయాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి. జీవితంలో తన ఎదుగుదలకు కారణం అమ్మానాన్నలే అంటూ చాలా సార్లు చెప్పుకొచ్చాడు కమెడియన్ అలీ. ఇప్పుడు ఆయన తల్లి దూరమవడంతో విషాదంలో మునిగిపోయాడు.

More Related Stories