English   

చిరు మూవీ కోసం కెరీర్ లోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్

Mani Sharma
2019-12-19 15:06:36

దశాబ్ధం క్రితం తెలుగులో ఏ స్టార్ హీరో సినిమా అయినా మ్యూజిక్ ఎవరు అని చూస్తే మణిశర్మ పేరు కనబడేది. తన పాటల సందడితో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మణిశర్మ తర్వాత తర్వాత కొత్త సంగీత దర్శకుల ఎంట్రీతో సినిమాలను పూర్తిగా తగ్గించాడు. వచ్చిన అరకొర అవాకాశలను చేస్తూ కాలం గడుపుతున్న మణిశర్మ కొన్ని సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తూ వస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్నాడు ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్. దీంతో చిరుతో మళ్ళీ సినిమా చేసే ఛాన్స్ పట్టేశాడు ఈయన. చాలా ఏళ్ళ తరువాత మణిశర్మ మెగాస్టార్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చివరగా వీరి కాంబినేషన్ లో స్టాలిన్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మళ్లి 13 ఏళ్ళ తరువాత మెగాస్టార్ సినిమాకు మణిశర్మ ట్యూన్స్ చేస్తున్నాడు. సోషల్ కాన్సెప్ట్ ఆధారంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో పాటలకు చాలా ప్రాధాన్యం ఉండటంతో సీనియర్ డైరెక్టర్ అయిన మణిశర్మను తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాకి యాభై లక్షలు రెమ్యునరేషన్ అందుకున్న ఆయన ఈ సినిమా కోసం ఏకంగా కోటిన్నర రెమ్యునరేషన్ అందుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది.  ఇప్పటిదాకా యాభై లక్షల దాకే పరిమితం అయిన ఆయన కోటి పైగా తీసుకోవడంతో ఇదే ఆయన కెరీర్ లో ఇప్పటిదాకా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అని చెబుతున్నారు. 

More Related Stories