English   

మహేష్ అల్లు అరవింద్...డైరెక్టర్ కోసమే వెయిటింగ్

Allu Aravind Mahesh Babu
2019-12-19 16:38:02

మహేష్ బాబు తన మొదటి సినిమా మొదలుకొని తెలుగులో ఇప్పుడున్న బడా బేనర్లు అన్నిటిలో సినిమాలు చేశాడు ఒక్క గీతా ఆర్ట్స్‌ లో తప్ప. ఎందుకంటే ఆ బేనర్లో ఎప్పుడూ మెగా హీరోల సినిమాలే తెరకెక్కుతుంటాయి. అప్పుడప్పడూ బయటి హీరోలతో చిన్న, మీడియం రేంజి సినిమాలు చేస్తుంటారు తప్ప పెద్ద సినిమాలు కానీ పెద్ద స్టార్స్ తో కానీ చేయడం లేదు. కానీ మహేష్ బాబుతో మాత్రం ఒక సినిమా చేయాలని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం నమ్రత - అల్లు అరవింద్ ల మద్య చర్చలు కూడా జరిగాయని పారితోషికం విషయంలో చర్చలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. సినిమా నిర్మాణంలో భాగస్వామి చేసి లాభాల్లో వాటా ఇమ్మని మహేష్ కోరాడని అందుకు అరవింద్ ఒప్పుకోలేదని ప్రచారం జరిగింది. అలా పరశురామ్ మహేష్ బాబుల కాంబో మూవీని అల్లు అరవింద్ నిర్మించడం కన్ఫర్మ్ అనుకుంటే అది అటకెక్కింది. పరశురామ్ ఇది తేలే యవ్వారం కాదనుకుని తన దారి తను చూసుకున్నాడు. ఇక గీతా ఆర్ట్స్ లో మహేష్ సినిమా ఉండక పోవచ్చని అంతా అనుకుంటున్న సమయంలో బన్నీ వాసు కీలక ప్రకటన చేశాడు. గీతా 2 బ్యానర్ లో తెరకెక్కిన 'ప్రతిరోజు పండుగే' సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గీతా ఆర్ట్స్ లో సినిమా చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు.  వచ్చే ఏడాదిలో ఈ సినిమాకి సంబందించిన కీలక ప్రకటన రాబోతుందని బన్నీ వాసు ప్రకటించాడు. దర్శకుడు ఎవరు.. ఎప్పుడు ఉంటుందనే విషయం ఇంకా ఫైనల్ కాలేదని అంటున్నారు. మహేష్ బాబు 27వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కన్ఫర్మ్ అయ్యింది. కనుక మహేష్ 28వ సినిమా గీతా ఆర్ట్స్ లో ఉండే అవకాశం ఉండచ్చని అంటున్నారు. 

More Related Stories