English   

బాలయ్య డైరెక్టర్ గా క్రేజీ సినిమా సీక్వేల్ 

Balakrishna
2019-12-19 17:57:45

వయసుతో సంబంధం లేకుండా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి కాగా వచ్చే ఏడాది నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెర మీదకి వచ్చిందిది. అదేంటంటే నిజానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఆదిత్య 369కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు గతకొద్ది కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి బాలయ్య 100వ చిత్రంగా ‘ఆదిత్య 999’ రావాల్సింది. అనుకోని కారణాల వల్ల ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఆ తరువాత బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీ అవ్వడం ఆ తర్వాత వరుస సినిమాలు చేయడంతో బిజీ అయిపోయారు. అయితే ఈసరి ఈ సీక్వెల్ ను బాలకృష్ణ స్వయంగా ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం మొదలయింది. బోయపాటి సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ప్రచారం వరకే ఆగుతుందా లేక నిజమేనా అని తెలియాలి అంటే బాలయ్యే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

More Related Stories