English   

విజయ్ దేవరకొండకి అన్ని కోట్ల రెమ్యునరేషన్ 

 Vijay Deverakonda
2019-12-19 18:02:59

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లాలి కథానాయికలుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత పూరీ-విజయ్ కంబినేషన్లో ఫైటర్ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాకి వీటితో పాటు దిల్ రాజు ప్రొడక్షన్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో మరో కొత్త సినిమాను చేస్తున్నాడు. ఇక విజయ్ కు టాలీవుడ్ లోఅలాగే బాలీవుడ్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని కరణ్ జోహార్ ఎప్పటినుండో విజయ్ తో సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు.

నిజానికి డియర్ కామ్రేడ్ సినిమా రీమేక్ అనుకున్నాడు కానీ దానిని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశాడు కానీ అది వర్క్ అవుట్ కాలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ హీరోగా మరో ప్యాన్ ఇన్దిఆ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసమే విజయ్ కు భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం విజయ్ దేవరకొండకి ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ అక్షరాలా 48 కోట్లు అని అంటున్నారు. ఇది నిజానికి పెద్ద డీల్ అని చెప్పాలి. ఎందుకంటే మన హీరోలు ఇప్పటిదాకా అంత రెమ్యునరేషన్ తీసుకోలేదు. మహేష్ బాబు రైట్స్ రూపంలో తీసుకున్నా అవి కూడా ఇంత మించవని అంటున్నారు. చూడాలి మరి ఇందులో నిజం ఎంతుందో

More Related Stories