English   

గుళ్లో ప్రత్యేక పూజలు చేయించిన నయనతార, విఘ్నేష్ శివన్..

nayan
2019-12-20 04:57:26

నయనతార కొన్ని రోజులుగా గుడుల చుట్టూ తిరుగుతుంది. ప్రత్యేక పూజలు చేయిస్తుంది. త్వరలో పెళ్లికూతురు కాబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి కూడా. కానీ అలాంటిదేమీ లేదు అంటూ చెబుతున్నాయి నయనతార సన్నిహిత వర్గాలు. అయితే ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి అన్ని గుళ్ళకు తిరుగుతుంది నయనతార. ఆ మధ్య కాంచీపురం లోని ప్రఖ్యాత అత్తి వరదరాజ స్వామి గుడి దర్శించుకుంది. ఆ తర్వాత మొన్నటికి మొన్న తిరుమలకు వచ్చారు ఈ జోడి. ఇక ఇప్పుడు మరో గుడికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేయించారు నయనతార జంట. త్వరలోనే వీళ్ళు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తమిళనాట వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.. కానీ నయనతార మనసులో మాత్రం పెళ్లి వైపు ఆలోచనలు ఆశలు లేవని తెలుస్తోంది.

ఈమె జాతకాన్ని బలంగా నమ్ముతోందని.. ఈమె జాతకంలో తల్లి గండం ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. అందుకే సహజీవనంతోనే సరిపెట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. గతంలో కూడా పెళ్లి వరకు వచ్చి రెండు సార్లు నయనతార మోసపోయింది. అందుకే ఈసారి మాత్రం పెళ్లి గిల్లి అనే పదాలు లేకుండా ప్రశాంతంగా ప్రియుడితో జీవితం గడిపేస్తుంది నయనతార. మధ్యలో ఆధ్యాత్మిక ధోరణిలో వెళ్తుంది. అందుకే ఇలా గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతుంది నయనతార. ప్రస్తుతం రజనీకాంత్ దర్బార్ సినిమాలో నటిస్తోంది. ఈ కేరళ కుట్టి దాంతో పాటు ప్రియుడు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతుంది.

More Related Stories