English   

తెలుగు ఇండస్ట్రీలో మరో క్రేజీ మల్టీస్టారర్..

ravi
2019-12-20 05:24:48

తెలుగు హీరోలు ఒకప్పటిలా లేరు. ఇప్పుడు మన హీరోల్లో కూడా కావాల్సినంత మార్పు వచ్చేసింది. కథ సహకరిస్తే మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్, నాగార్జున, నాని, నాగచైతన్య లాంటి హీరోలు వరుసగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్ కూడా కలిసి రాజమౌళి లాంటి దర్శకుడిని నమ్మి ఒక భారీ మల్టీస్టారర్ చేస్తున్నారు. ఇదే కోవలో ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ రెడీ అవుతుంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. మాస్ మహారాజా రవితేజ ఇందులో హీరోలుగా నటించబోతున్నారు. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది కూడా ఎవరో కాదు స్వయంగా సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ప్రతి రోజు పండగే సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఈయన రవితేజతో చేయబోయే మల్టీస్టారర్ గురించి మీడియాతో ఓపెన్ అయిపోయాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని.. ఖచ్చితంగా ఈ సినిమా అందరినీ అలరిస్తుందని చెబుతున్నారు సాయి ధరమ్ తేజ్. మెగా కాంపౌండ్ లో కాకుండా రవితేజ అంటే తనకు చాలా ఇష్టం అని ఎప్పటినుంచో చెబుతున్నాడు సాయి.

అలాంటిది అభిమాన హీరోతో ఇప్పుడు కలిసి నటించే అవకాశం రావడంతో మెగా మేనల్లుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది మాత్రం ఇంకా చెప్పలేదు సాయి ధరమ్ తేజ్. ఒక లైన్ మాత్రమే అనుకున్నామని.. దాన్ని డెవలప్ చేసి పూర్తి స్క్రిప్ట్ తయారు అయిన తర్వాత సర్ప్రైజ్ చేస్తానంటున్నాడు మెగా మేనల్లుడు. ప్రస్తుతం కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సో బెటరూ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత దేవా కట్ట దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ గ్యాప్ లోనే రవితేజతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు సాయి తేజ్. ఇద్దరు ఎనర్జిటిక్ మాస్ హీరోలు కలిసి వచ్చే సినిమా ఎలా ఉంటుందో అభిమానుల ఊహలకే వదిలేస్తున్నాడు ఈ మెగా హీరో.

More Related Stories