English   

చిరు - కొరటాల సినిమా షూట్ కి ముహూర్తం కుదిరింది

Chiranjeevi Koratala Siva movie shooting started.jpg
2019-12-20 06:08:28

రీ ఎంట్రీ తరువాత మెగాస్టార్‌ అస్సలు ఖంగారు పడడం లేదు. ఖైదీ నంబర్‌ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ఘన విజయం సాధించకపోయినా తెలుగు వరకూ మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ సినిమా త‌ర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే క‌థ కూడా ఫైన‌ల్ అయిపోయింది. ఇటీవలె దసరా సందర్భంగా ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.

అయితే ఇప్పటివరకు రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ఈ సినిమాలో మెగాస్టార్‌కు జోడిగా చెన్నై బ్యూటీ త్రిష నటించనుంది. భరత్‌ అనే నేను సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న దర్శకుడు కొరటాల శివ, మెగా ఇమేజ్‌కు తగ్గ కథను రెడీ చేశాడని ఈ సినిమాలో చిరు యంగ్ లుక్‌లో కనిపించనున్నాడని ఒక ప్రచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారట. ఈ నెల 26వ తేదీ నుండి షూట్ మొదలవుతుందని అంటున్నారు. అయితే ఇంకా షూటింగ్ ప్రారంభం కాకపోయినా.. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌పై చర్చ మొదలైంది. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. నిజానికి ఈ సినిమాను వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు.

అయితే ఇంకా షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో ఆగస్టులో విడుదల చేయాలని అనుకుంటున్నారని అంటున్నారు. త్వరలోనే షూట్ కి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడవచ్చని అనుకుంటున్నారు.

More Related Stories