English   

బాలకృష్ణ రూలర్ ఫస్ట్ టాక్.. ఓన్లీ ఫర్ ఫ్యాన్స్..

Ruler First Talk
2019-12-20 11:27:32

బాలయ్య నటించిన రూలర్ సినిమాపై అంచనాలు ముందు నుంచి కూడా యావరేజ్ గానే ఉన్నాయి. జై సింహా కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మాస్ ఆడియన్స్ కు పండగే అంటూ ఆసక్తి బాగానే ఉంది. ఇక ఇప్పుడు విడుదలైన ఈ సినిమాకు కూడా టాక్ అలాగే వచ్చింది. కొత్త కథ అంటూ ఏమీ లేదు.. రొటీన్ కథని మాస్ ఆడియన్స్ కి నచ్చేలా కె.ఎస్.రవికుమార్ చేసాడని తెలుస్తోంది. ఫస్టాఫ్ అంతా బాలకృష్ణ లాంటి హీరోని పెట్టుకొని కూడా ఒక్కటంటే ఒక్క ఫైట్ కూడా లేకుండా జాగ్రత్తపడ్డాడు కె.ఎస్.రవికుమార్. ఇంటర్వెల్ తర్వాత అసలు రచ్చ మొదలైంది. అక్కడినుంచి బాలయ్య పోలీస్ అవతారం మొదలు కావడంతో యాక్షన్ సన్నివేశాలు కూడా ఒక్కొక్కటిగా వచ్చాయి. ఓవరాల్ గా చూసుకుంటే రూలర్ సినిమా అభిమానులకు బాగానే నచ్చుతుంది కానీ సాధారణ ప్రేక్షకులను మాత్రం బాలయ్య ఎంతవరకూ మెప్పిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. హీరోయిన్లు సోనాల్ చౌహాన్, వేదిక అందాల ఆరబోత ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ముఖ్యంగా సోనాల్ ఏకంగా బికినీ అందాలు కూడా ఆరబోసింది. ఫస్ట్ హాఫ్ లో జబర్దస్త్ గ్యాంగ్ చేసే కామెడీ అక్కడక్కడా పర్లేదు అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే రూలర్ యావరేజ్ యాక్షన్ డ్రామా అని తేలిపోయింది. 

More Related Stories